రోజూ సైక్లింగ్ తో బెల్లీ ఫ్యాట్ మాయం..!

ఈరోజుల్లో ప్రజల జీవన శైలి మారిపోయింది. ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డారు. దీంతో దాదాపు 80 శాతం మంది అధిక బరువుతో సతమతమవుతున్నారు. పొట్ట, తొడల భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. 

ఈ కొవ్వును తగ్గించేందుకు వ్యయ ప్రయాసాలు తప్పడం లేదు. అయితే ఈ కొవ్వను తగ్గించుకోవడం అంత సులువు కాదు. దీని కోసం అనేక కసరత్తులు చేయాలి. కానీ సైక్లింగ్ చేయడం వల్ల పొట్ట, తొడల భాగాల్లో ఏర్పడిన కొవ్వును కరిగించుకోవచ్చు.. రోజూ సైక్లింగ్ చేయడం వల్ల జీవక్రియ రేటు పెరగడంతో పాటు శరీరంలోని కండరాలు గట్టిపడతాయి. శరీరానికి బలం చేకూరుతుంది.

చాలా మంది కొద్ది దూరం ప్రయాణించాల్సి వచ్చినా.. బైక్ వాడుతుంటారు. అలాకాకుండా తక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఇతర వాహనాలకు బదులుగా సైకిల్ వాడండి. సైక్లింగ్ చేయడం వల్ల కేలరీలు బర్న్ చేయడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు స్వస్తి చెప్పొచ్చు. రోజూ సైక్లింగ్ చేయడం వల్ల గంటకు 300 కేలరీలను బర్న్ చేసుకోవచ్చు. సైక్లింగ్ తో పాటు ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతుంది. సైక్లింగ్ ఏ వయసు వారైనా చేయవచ్చు. సైక్లింగ్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం, మధుమేహం, తీవ్ర ఒత్తిడిని జయించవచ్చు.   

Leave a Comment