కుక్కతో బాలిక పెళ్లి.. ఇదేం ఆచారం రా సామి..!

టెక్నాలజీ ఎంత పెరుగుతున్నప్పటికీ కొంత మందిలో మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఆచారాల పేరుతో అనాగరిక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ ఆచారం ఒడిశాలోని కరగోలాలో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామస్తులు ఓ అమ్మాయికి ఏకంగా వీధి కుక్కతో పెళ్లి జరిపించారు. 

ఇలా పెళ్లి చేయడానికి ఓ కారణం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ బాలికకు పాలదంతాలు మొదట దవడ భాగంలో వచ్చాయట.. అది  అశుభమట. అందుకే కుక్కతో పెళ్లి చేసినట్లు పెద్దలు చెప్పారు. ఇలా చేయకపోతే భవిష్యత్తులో అది పిల్లలకి ప్రమాదకరమని కూడా నమ్ముతారు. పాల దంతాలు దవడ భాగంలో వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇలానే చేస్తామని గ్రామస్తులు అంటున్నారు. ఈ ఆచారంలో భాగంగా స్థానికుల మధ్య పూర్తి అలంకరణ, విందు, హంగామతో పెళ్లి జరుగుతుంది. 

Leave a Comment