జుట్టు సంరక్షణ కోసం చిట్కాలు..

Home remedies for hair fall in telugu

ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా మారింది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సు నుంచి జుట్టు రాలుతోంది. దీనికి పోషకహార లోపం, కాలుష్యం, ఒత్తిడి  ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.

దీనికి తోడు కెమికల్స్ ఉన్న షాంపులు వాడటం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు రాలుతుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలు జుట్టు రాలడాన్ని నివారించడంలో ఉపయోగపడతాయి. వీటిలో కొన్ని రకాల నూనెలు, ఇంట్లో తయారు చేసుకుని తలకు పట్టించే కొన్ని మశ్రమాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొబ్బరి నూనె మసాజ్..

కొబ్బరి నూనె జుట్టు రాలకుండా నివారించేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇది వెంట్రుక షాఫ్ట్ లోపలికి సులభంగా చొచ్చుకుని పోయి వెంట్రకకు బలాన్ని ఇస్తుంది. జుట్టు దెబ్బతినకుండా, రాలకుండా పని చేస్తుంది. కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలో తెలియజేస్తున్నాం..

 • ఒకటి లేదా రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకొని దానిని వేడి చేయండి.
 • ఆ నూనెను జుట్టు కుదళ్లకు రాసి సున్నితంగా మసాజ్ చేయండి.
 • దానికి రాత్రంతా లేదా ఒక గంట వరకు వదిలేయండి.
 • తర్వాత తల స్నానం చేయండి. ఇలా రోజు విడిచి రోజు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. 
 • జుట్టుకు నూనె రాసినప్పుడు బయట తిరగకండి. ఎందుకంటే దుమ్ము, ధూళి తలలో వెళ్లి వెంట్రుకలకు నష్టాన్ని కలుగజేస్తుంది. ఒక వేళ వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసకోండి. 

పిప్పరమెంట్ నూనె..

పిప్పరమెంట్ నూనె జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. జుట్టు మందాన్ని కూడా పెంచుతుంది. పిప్పరమెంట్ నూనె శక్తివంతమైన హెయిర్ గ్రోత్ ఏజెంట్ అని ఒక అధ్యయనంలో తేలింది. జుట్టుకు పిప్పరమెంట్ నూనె ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

 • కొన్ని చుక్కల పిప్పరమెంట్ నూనె, కొంచెం సహజ నూనె తీసుకొని రెండింటిని కలపండి. 
 • ఈ నూనెతో జుట్టుకు బాగా మసాజ్ చేసి ఒక గంటపాటు అలాగే ఉంచండి. తర్వాత షాంపుతో తల స్నానం చేయండి.

లావెండర్ నూనె..

జుట్టు పెరుగుదలకు లావెండర్ నూనె బాగా ఉపయోగపడుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ఇది జుట్టు రాలకుండా చేస్తుంది. 

 • ఒక టీస్పూన్ లావెండర్ నూనెను తీసుకొని రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెతో కలపండి.
 • మీ వేళ్లతో తలపై బాగా మసాజ్ చేయండి. దానిని ఒక రాత్రంత వదిలేయండి.
 • ఉదయం తలస్నానం చేయండి. వారానికి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 

నిమ్మకాయ..

నిమ్మకాయను ఇంట్లో జుట్టుకు ఉపయోగిస్తుంటాం. ఇది జుట్టు రాలకుండా చేయడంలో మంచి ఫిలాతాలను ఇస్తుంది. 

 • ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో మూడు టేబుల స్పూన్ల కలబంద రసాన్ని కలపాలి. 
 • ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేయండి. దానిని అరగంట లేదా గంట వరకు పట్టించి తల స్నానం చేయండి. 

ఉల్లిపాయలు..

జుట్టు రాలకుండా చేయడంలో ఉల్లిపాయ రసం బాగా ప్రభావితం చేస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయలు బాగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాల్లో రుజువయ్యాయి.

 • ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం తీసుకొని ఒక కాటన్ బాల్ ను దానిలో ముంచండి.
 • ఈ కాటన్ బాల్ సహాయంతో మీ తల అంతా ఈ రసాన్ని రాయండి.
 • తరువాత వేళ్లతో మసాజ్ చేయండి.
 • దాదాపు గంట అలాగే వదిలేసి తరువాత కడగండి.
 • ఇలా  రోజు విడిచి రోజు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 

మందార..

మందార మొక్క అందరికి అందుబాటులో ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో అద్భుతంగా పని చేస్తుంది. మందారను జుట్టుకు రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. 

మందార నూనె..

 • 8 నుంచి 10 మందార ఆకులను తీసుకోండి.
 • ఈ ఆకులను నూరి ఒక కప్పు వేడిచేసిన కొబ్బరి నూనెలో కలపండి.
 • అది చల్లారిన తరువాత, ఈ నూనెను మీ తలకు పట్టించి ఒక రాత్రంతా అలా వదిలేయండవి. మరుసటి రోజు తలస్నానం చేయండి.

మందార హెయిర్ మాస్క్..

 • కొన్ని మందార ఆకులను పేస్ట్ చేయండి
 • దీనికి 4 టేబుల్ స్పూన్ల పెరుగు కలపండి.
 • దీనిని తలకు పట్టించి గంట సేపు ఉంచండి.
 • తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయండి.

Leave a Comment