త్వరలో మొబైల్ డేటా ఛార్జీల మోత..!

త్వరలో టెకికం కంపెనీలు తమ వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నాయి. మొబైల్ ఇంటర్నెట్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. గతంలో మొబైల్ ఛార్జీలు, డేటా చార్జీలు ఎక్కువగా ఉండేవి. అప్పుడు మొబైల్ వినియోగదారుల సంఖ్య కూడా తక్కువ ఉండేది. అయితే మార్కెట్ లో రిలయన్స్ జియో ఎప్పుడు ప్రవేశించిందో..పరిస్థతి మారిపోయింది. అన్ని ఉచితం అంటూ మొబైల్ ఫోన్లకు, డేటా వినియోగానికి అందరినీ దగ్గర చేసింది. 

అప్పటి నుంచి వేరే టెలికం కంపెనీలు చేసేది ఏం లేక తమ నెట్ వర్క్ ఛార్జీలను తగ్గించాల్సి వచ్చింది. అయితే వారికి నష్టాలు రావడంతో ఇతర టెలికం సంస్థలు తమ ఛార్జీలను పెంచుతున్నాయి. దీనికి జియో కూడా మినహాయింపు ఏమీ కాాదు. అయితే మరింత ఛార్జీలు పెంచుకునే అవకాశం ఇవ్వాలని టెలికం కంపెనీలు ట్రాయ్ ను కోరుతున్నాయి. ఒక వేళ ట్రయ్ వారు కోరినట్లుగా డేటా ఛార్జీలను నిర్ణయిస్తే..ఇక మొబైల్ వినియోగదారులకు మోత మోగినట్టే..ప్రస్తుతం ఉన్న డేటా ఛార్జీలు 5 నుంచి 10 రెట్టు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

వొడాఫోన్ ఐడియా ఒక జీబీ డేటా ఛార్జీ కనీసం రూ.35 ఉండాలని కోరింది. ఎయిర్ టెల్ రూ.30 ఉండాలని, జియో మాత్రం రూ.20 ఉండాలని ట్రాయ్, టెలికం శాఖ ముందు ప్రతిపాదనలు పెట్టాయి. ప్రస్తుతం దేశంలో మొబైల్ వినియోగదారులు ఒక జీబీకి రూ.3 నుంచి రూ.5 చొప్పున 4జీ డేటా పొందుతున్నారు. డేటా ఛార్జీల విషయమై సంబంధిత వర్గాలతో ట్రాయ్ చర్చలు జరుపుతుంది. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల ప్రతిపాదనలకు నీతి ఆయోగ్ కూడా సానుకూలంగా స్పందిస్తోంది. అదే జరిగితే త్వరలోనే మొబైల్ బిల్లుల మోత మోగనున్నాయి. 

Leave a Comment