బాడీ పెయిన్స్ తగ్గాలంటే ఇలా చేయండి.. ఇంటి చిట్కాలివే..!

కొంత మంది అదే పనిగా చిన్న నొప్పలు వచ్చిన,ఇంకా అలసటగ ఉన్న నొప్పి తగ్గడానికి ఉపయోగించే మందులు ఎక్కువగ వాడుతారు.అలా వాడటము ఆరోగ్యనికి మంచిది కాదు అని నిపుణులు చెపుతున్నారు. ఈ మందులకు బదులు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే బాగుంటుంది.హాయిగా ఇంటిలోని వైద్యం చేసుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితంలో అలసట, ఆందోళన సర్వసాధారణమే. రోజంతా పనిచేసి ఇంటికి చేరుకున్నాక ఒంటినొప్పులు మరో బాధను కలిగిస్తాయి. 

కనీసం హాయిగా పడుకుందామనుకున్నా. ఇంటి బాధ్యతలు నిల్చోనివ్వవు, కూర్చోనివ్వవు.కరోనా వచ్చి అందరి జీవితాలని చిన్న భిన్నము చేసింది.ప్రజలు అందరు ఆర్థికముగా భాగ దెబ్బ తిన్నారు. మళ్ళీ గాడిలో వాళ్ళ జీవితాలు పడటానికి ఎక్కువ కష్టపడ్డుతున్నారు. అందువలన ఎక్కువ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఈ పెయిన్స్ తగ్గడానికి మందులు అదే పనిగా వాడుతున్నారు ప్రజలు. ఇలా వాడాటము వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ మందులు వాడటం తగ్గించి ఇవి వాడితే నొప్పులు తగ్గుముఖము పడుతుంది.

అలసటను తగ్గించుకోవడానికి పసుపు పాలు చాలా ఉపయోగపడుతాయి.రోజు రాత్రి పడుకునే ముందు బాడీ పెయిన్స్ తగ్గటానికి ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ పసుపు వేసుకొని తాగడం మంచిది.అల్లం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.శరీర నొప్పి, వాపు మొదలైన వాటిని కూడా బాగా తగ్గిస్తుంది.  ఒక అల్లం ముక్కను నీటిలో మరిగించి ఫిల్టర్ చేసి తాగితే ఎంతో ఉపయోగపడుతుంది.బెల్లం తీసుకోవడం మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రాత్రి భోజనం తర్వాత మీరు ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోని తినండి. ఇది మీకు అలసట నుండి ఉపశమనం ఇస్తుంది మిమ్మల్ని మీరు రిఫ్రెష్‌గా భావిస్తారు. 

శరీర నొప్పిని వదిలించుకోవడానికి మీరు ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా శరీరం వాపును తగ్గించవచ్చు. ఇది నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఒక కప్పు ఆవనూనెలో నాలుగు లవంగాలు వెల్లుల్లి వేసి బాగా వేడిచెసిన తరువాత  గోరువెచ్చగా ఉన్నప్పుడు, దానిని నొప్పి ఎక్కువ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి.ఒకవేళ మీ శరీరంలో వాపు ఉన్నట్లయితే ఆవ నూనెను వాడాలి.

గోరువెచ్చని నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ తేనె కలిపిన తర్వాత తాగండి. సల్ఫర్, మెగ్నీషియం ఉప్పులో తగినంత పరిమాణంలో ఉంటాయి. అందువల్ల, మీరు ఉప్పును బాగా వేడి చేసి, ఒక బట్టలో పెట్టి నొప్పి వున్న చోట గెట్టిగా కట్టాలి.ఇది మీకు శరీర నొప్పి నుంచి వెంటనే ఉపశమనం ఇస్తుంది.ఇలా ఇంటిలో దొరికే పదార్థలతోనె మనం రోజు బాధ పడే నొప్పులు నుంచి మంచి ఉపసం పొందవచ్చు.

 

Leave a Comment