తిన్న తర్వాత చెయ్యకూడని పనులివే.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..!

ఈ కాలములో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణము రోజు తినే ఆహారంలో సమయ వేళలు పాటించకపోవడం, టెన్షన్‌, బయటి ఫుడ్డు  ఎక్కువగా తీసు కోవడం,ఎక్కువ మసాలు ఫుడ్స్ తీసుకోవడం,తిన్న తరవాత కొన్ని పొరబాట్లు చెయ్యడం, ఇలాంటి కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు.ఇవి మారాలి జీవన శైలిలో  కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా మంది భోజనం చేశాక మళ్లీ ఏదో ఒకటి తింటుంటారు.

అలా తినడం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు.నేటి సమాజములో ఎక్కువ జనాభా భోజనము చేసిన వెంటనే ఏదో ఓకే పండ్లు తినేస్తున్నారు.ఇంకా పెళ్లిళ్లు, శుభాకార్యంలో, విందులో పండ్లు పెడుతున్నారు. వీటికి వెళ్లిన వాళ్లు తిన్న వెంటనే ఆ పండ్లు తింటున్నారు. ఇలా తిన్న తరవాత పండ్లు తింటే ఆహారము సరిగ్గా జీర్ణము కాదు, ఇంకా పోషకాలు కూడా ఒంటికి సరిగ్గా అందవు. 

భోజనము తర్వాత ఒక గంట అంత కన్నా ఎక్కువ సేపు ఏమి తినకూడదు. మరికొందరికి భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తుంటారు. ఇలా చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో పాటు గ్యాస్, కడుపులో మంట వంటివి వస్తాయి. అంతగా స్నానం చేయాలనుకుంటే భోజనమయ్యాక ఓ గంట ఆగి చేయండి. మనలో చాలా మంది తిన్న తరువాత వెంటనే నిద్ర పోతారు. కాసేపు కూడా ఆగకుండా అలాగే నిద్రపోతారు. కానీ అలా చేయకూడదు. భోజనం చేయగానే నిద్రపోతే బరువు పెరుగుతారు. 

తిన్న వెంటనే వ్యాయామం కూడా చేయకూడదు. అలేగా టీ, కాఫీలు తాగకూడదు. అలా అని తిన్న వెంటనే కూర్చోకూడదు. మెల్లిగా కాసేపు అటూ ఇటూ నడిస్తే చాలా మంచిది. నడవమన్నారు అని ఎక్కువ దూరము ప్రయాణించ కూడదు. పని చేసే ప్రదేశాల్లో చాలా మంది కి తిన్న తర్వాత కొంచెము సేపు సిగ్గరెట్ తాగుతారు. అలా చెయ్యకూడదు అది ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంది .మామూలుగా 10 సిగ్గరేట్లు తాగితే ఎంత ప్రభావము మన శరీరము మీద ఉంటుందో తిన్న తరవాత ఒక సిగ్గరెట్ కూడా అంత ప్రభావము చూపుతుంది.ఇంకా భయంకరమైన కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి.

చాలా మంది ఉద్యోగస్తులు ఆఫీసుల్లో లంచ్ చేసేటపుడు బెల్ట్ పెట్టుకునే భోజనం కానించేస్తారు. కానీ అలా చేయకూడదంట. తినేటపుడు కడుపును నిర్బందిస్తే.. జీర్ణక్రియ సమస్యలు వస్తాయట. తినే సమయంలో బెల్ట్ ను వదులు చేసుకోవడం, లేదా పూర్తిగా తీసేయడం ఇంకా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.తిన్న వెంటనే ఈత కొట్టడం చాలా ప్రమాదకరం. దీని ద్వారా కడుపు తిమ్మిరికి వచ్చే ప్రమాదం ఎక్కువ. తిన్న తర్వాత ఈత కొడితే జీర్ణక్రియ భాగా పనిచేస్తుందని అంటుంటారు. అయితే ఈతకు జీర్ణక్రియకు సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.

 

Leave a Comment