పునాది లేకుండానే ఇంటి నిర్మాణం.. 40 శాతం ఖర్చు తక్కువట..!

ఇల్లు కట్టాలంటే పునాది ఎంతో కీలకం.. పునాది లేకుండా ఇంటి నిర్మాణం అనేది సాధ్యం కాదు. అంతేకాదు ప్రస్తుతం ఇంటి నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని.. కానీ కర్ణాటకలోని మైసూర్ కి చెందిన శరత్ కుమార్ అనే ఆర్కిటెక్ట్ పునాది లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. అందుకోసం కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. ఇప్పటికే ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి రెండు ఇళ్లను కూడా కట్టేశాడు.. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని శరత్ కుమార్ చెబుతున్నారు… 

పునాది లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్న ఈ కొత్త టెక్నాలజీని అడ్వాన్స్డ్ ర్యాపిడ్ కన్ స్ట్రక్షన్ అని అంటారు. శరత్ కుమార్ రెండేళ్ల పాటు ఓ విదేశీ సంస్థలో ఆర్కిటెక్ట్ గా పనిచేశారు. అక్కడ ఈ టెన్నాలజీ గురించి తెలుసుకున్నారు శరత్ కుమార్.. మొదట మైసూర్ లోని హెచ్ డీ కోటే ప్రాంతంలో ఓ డైరీ భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత బండిపాళ్యలో ఇంటిని నిర్మించారు. 

పునాది లేకుండా ఇల్లు నిర్మించే పద్ధతి:

ఈ కొత్త టెన్నాలజీలో పునాదికి బదులు 7 అడుగుల లోతు వరకు గుంతలు తవ్వి పిల్లర్లను ఏర్పాటు చేస్తారు. ఆ పిల్లర్లను కలుపుతూ కాంక్రీట్ తో బీమ్ లను పోస్తారు. ఆ తర్వాత స్లాబ్ వేస్తారు. ఇలా మూడు విధాలుగా ఇంటిని నిర్మిస్తారు. సాధారణంగా ఇల్లు నిర్మించాలంటే కనీసం 6 లేదా 7 నెలలు పడుతుంది. కానీ ఈ కొత్త టెక్నాలజీతో కేవలం 3 నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. ఇందులో కూలీల అవసరం కూడా తక్కువగా ఉంటుంది. 30 నుంచి 40 శాతం నిర్మాణ వ్యయం తగ్గుతుంది. ఇక నిర్మాణానికి కాంక్రీట్ ఉపయోగించడం వల్ల ఇల్లు 75-100 సంవత్సరాల వరకు దృఢంగా ఉంటుందని శరత్ కుమార్ వివరించారు.    

 

Leave a Comment