పుదీనాతో ఒత్తిడి దూరం.. తాజా పరిశోధనలో వెల్లడి..!

మన పరిసరాల్లో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. పదీనాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని అనేక రకాల వ్యాధులకు తయారు చేసే ఔషధాలలో ఎక్కువ శాతం వాడుతుంటారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పుదీనాకు ఎంతో డిమాండ్ ఉంది. చికిత్సా విధానాల్లో పుదీనాను జీర్ణ సంబంధ వ్యాధులకు ఉపయోగిస్తారు. పుదీనాను భారతీయ వంటకాల్లో తరుచూ వాడుతుంటారు. అందుకే ప్రతి వంటింట్లో లభ్యమవుతుంది. పుదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చాలా రకాల రుగ్మతలను దూరం చేస్తుంది. పుదీనాతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పుదీనాతో ఆరోగ్య ప్రయోజనాలు:

  • పుదీనాలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అలర్జీని దూరం చేస్తాయి.
  • శ్వాస సంబంధిత సమస్యలను పుదీనా దరిచేరనివ్వదు.
  • పుదీనా నోటిలోని హానికర బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. 
  • వర్షాకాలం, శీతాకాలంలో పుదీనా ఆకుల నూనె వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు, గొంతునొప్పిల నుంచి ఉపశమనం పొందవచ్చు. 
  • పుదీనా ఉండే విటమిన్ సి, డీ, ఇ, బి.. కాల్షియం, పాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలను దూరం చేస్తాయి. 
  • పుదీనా ఆకులతో టీని తయారు చేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. 
  • చర్మం దురదులుగా ఉన్నప్పుడు పుదీనా ఆకులను నలిపి దురద ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. 
  • పుదీనా ఆకులతో కాచిన కషాయంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్య తగ్గుతుంది. 
  • పుదీనా నుంచి మెంథాల్ తయారు చేస్తారు. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పుదీనా రసం రాసి మసాజ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. 
  • పుదీనాతో అరోమా థెరపీ కూడా ఉంది. పుదీనా వాసన చూడటం ద్వారా ఒత్తిడి దూరం చేసుకోవచ్చనేది పరిశోధనలో తేలింది. మెదడులోని కార్టిసాల్ స్థాయిని నియంత్రించడం ద్వారా విశ్రాంతి ఇస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. 
  • పుదీనాతో ఉండే ఆమ్లాలు జీర్ణ ప్రక్రియను సక్రమం చేస్తుంది. దీని వల్ల సహజ సిద్ధంగానే బరువు తగ్గవచ్చట.. 

 

Leave a Comment