ఏపీ వైసీపీలో ప్రపంకనలు.. ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. వీడియో వైరల్..! 

 హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఓ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన వీడియో సెన్సేషన్ గా మారింది. ఆ వీడియోలో న్యూడ్ గా ఉన్న ఎంపీ మహిళతో సెక్స్ వల్ టాక్ చేస్తున్నట్లుగా ఉంది. ఎంపీ గోరంట్ల రాసలీలల వీడియో లీక్ కావడంతో ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.. 

గౌరవప్రదమైన ఎంపీ పదవిలో ఉండే ఇంత చిల్లరగా వ్యవహరించడంపై అన్ని వర్గాలు మండిపడుతున్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియో వైసీపీలోనూ సెగలు రేపుతోంది. లీకైన వీడియోను గమనిస్తే తనకు సన్నిహితంగా ఉండే మహిళతోనే ఎంపీ మాధవ్ న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడారని భావిస్తున్నారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ తీరుపై టీడీపీ తీవ్రంగా స్పందిస్తోంది. ఎంపీ పదవికే కళంకం తెచ్చేలా ఎంపీ గోరంట్ల వ్యవహరించారని టీడీపీ మహిళా నేతలు విమర్శిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ ఎంపీ తీరు ఉందని మండిపడుతున్నారు.  న్యూడ్ వీడియో లీక్ కావడంతో వెంటనే గోరంట్ల మాధవ్ పై సీఎం జగన్ యాక్షన్ తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

 

 

Leave a Comment