అతని వల్ల లక్షల్లో డబ్బులు లాస్.. జగపతిబాబుపై వేణు షాకింగ్ కామెంట్స్..!

ఒకప్పుడు మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో వేణు తొట్టెంపూడి.. స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, ఖుషీ ఖుషీగా, కళ్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే, గోపి గోపిక గోదావరి వంటి చిత్రాల్లో నటించి సక్సెస్ సాధించాడు.. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన వేణు.. చాలా కాలం తర్వాత రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో నటించారు..లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా  ఆయన కెరీర్ లో మళ్లీ నిలదొక్కుకోవచ్చని భావించారు.. మళ్లీ ఆఫర్లు పెరుగుతాయని అనుకున్నారు. కానీ రామారావు ఆన్ డ్యూటీ ఫ్లాప్ కావడంతో ఆయన కెరీర్ మళ్లీ సందిగ్ధంలో పడింది. 

అయితే రామారావు ఆన్ డ్యూటీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జగపతి బాబుతో ఉన్న విభేదాల గురించి చెప్పారు.  జగపతిబాబు, వేణు కాంబినేషన్ లో హనుమాన్ జంక్షన్, ఖుషీ ఖుషీగా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి హిట్ అందుకున్నాయి. 

ఆ సమయంలో జగపతిబాబుకు తనకు మధ్య మంచి రిలేషన్ ఉండేదని చెప్పుకొచ్చారు. అయితే ఆయన వల్ల ఆర్థికంగా నష్టపోయానని వేణు తెలిపారు. జగపతిబాబు మధ్యవర్తిగా వేరే వాళ్లకు డబ్బులు ఇచ్చానని, ఆ వ్యక్తి డబ్బులు తిరిగి ఇవ్వలేదని వేణు అన్నారు. 14 లక్షల రూపాయలు నష్టాపోయానని, ఆ రోజుల్లో అది పెద్ద అమౌంట్ అని తెలిపారు. తర్వాత జగపతిబాబు తనకు కనీసం ఫోన్ కూడా చేయలేదన్నారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని వేణు చెప్పుకొచ్చారు.  

 

Leave a Comment