కర్ణాటకలో ‘హిజాబ్’ వివాదం.. పోటీగా హిందూ విద్యార్థినుల ర్యాలీ

కర్ణాటకలో హిజాబ్ పై వివాదం చెలరేగుతోంది..హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను కాలేజీకి అనుమతించకపోవడంతో వివాదం స్టార్ట్ అయ్యింది. కాలేజీలోకి అనుమతించకపోవడంపై కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి నిరసన తెలిపారు. దీనికి పోటీగా ఉడిపి జిల్లాలోని కుందాపూర్ లో హిందూ విద్యార్థినులు మెడలో కషాయ కండువాలు ధరించి రోడ్లపై ప్రదర్శన చేస్తున్నారు. ‘జైశ్రీరాం’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నారు.. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. 

ప్రస్తుతం ఈ అంశం కర్ణాటక హైకోర్టులో ఉంది. వచ్చే వారం హైకోర్టు ఈ విషయంలో ఉత్వర్వులుు వెలువడే వరకు ప్రస్తుత యూనిఫాం నిబంధనలను అనుసరించాలని కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థలన కోరింది. ఇదిలా ఉంటే ఈ వివాదంపై అధికారి పార్టీ, విపక్షాల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలకు కారణం అవుతోంది.. 

తాజాగా దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘విద్యార్థుల హిజాబ్ ను వారి చదువుకు అడ్డంకిగా మార్చడం ద్వారా మన భారత కుమార్తెల భవిష్యత్తును దోచుకుంటున్నాం. మాత సరస్వతి అందరికీ జ్ఞానాన్ని అందిస్తుంది. ఆమెకు భేదం లేదు’ అని ట్విట్టర్ లో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.  

 

  

 

Leave a Comment