ట్రాఫిక సమస్య వల్ల విడాకులు తీసుకుంటున్నారట.. మాజీ ముఖ్యమంత్రి సతీమణి విచిత్ర వాదన..!

సాధారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం.. లేదా ఇద్దరి మధ్య గొడవలు జరగడం.. లేదా కుటుంబాల మధ్య గొడవలు జరగడం వల్ల విడాకులు తీసుకుంటారు.. అయితే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ కొత్త వాదనను తీసుకొచ్చారు. ట్రాఫిక్ సమస్య వల్ల ముంబాయిలో విడాకులు పెరిగిపోతున్నాయని అన్నారు. ట్రాఫిక్ కారణంగా 3 శాతం మంది విడాకులు తీసుకుంటున్నారని తెలిపారు.. 

ముంబైలో రోడ్ల పరిస్థితి గురించి మీడియాతో ఆమె మాట్లాడుతూ ఈ కొత్త వాదనను వినిపించారు. ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు తమ కుటుంబ సభ్యులకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారని తెలిపారు. ఆ పరిస్థితులు విడాకులకు దారితీస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ వాదనపై శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది వ్యంగంగా కౌంటర్ ఇచ్చారు. ట్రాఫిక్ కారణంగా విడాకులు తీసుకుంటున్నారన్న మహిళకు ది బెస్ట్ లాజిక్ ఆఫ్ ది డే అవార్డును ఇవ్వాలని  ట్వీట్ చేశారు. 

Leave a Comment