కరోనా వైరస్ తో మెదడుకు అధిక ముప్పు..!

కరోనా వైరస్ ఎంతటి బీభత్సం సృష్టించిందో తెలిసిందే.. ఇక సెకండ్ వేవ్ లో అయితే వేల మందిని బలి తీసుకుంది. ఇప్పుడిప్పుడే తగ్గముఖం పడ కొత్త కొత్త వేరియంట్లలో రూపాంతరం చెందుతోంది. దీంతో కోవిడ్ ముప్పు ఇప్పుడే పూర్తిగా తగ్గలేదని నిపుణులు చెబుతున్నారు. కాగా, కోవిడ్ కారణంగా మనిషి శరీరంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. కొందరు బాధితుల్లో అరుదైన నాడీ సంబంధిత సమస్యలు  వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తయారు చేసిన వ్యాక్సిన్లతోనూ ఇలాంటి దుష్ప్రభావాలు ఉంటున్నట్లు నిపుణులు గుర్తించారు. అందులో భాగంగా బ్రిటన్ కు చెందిన 3.2 కోట్ల మంది ఆరోగ్య వివరాలను సేకరించి ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. కరోనా సోకిన తర్వాత 28 రోజులకు, లేదా కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్న తర్వాత 28 రోజుల్లో ఏ విధమైన నాడీ సంబంధ సమస్యలు వచ్చాయనేది వారు విశ్లేషణ చేశారు. ఈ పరిశోధనలలో వారు ఆసక్తికరమైన విషయాలను గుర్తించారు. నేచర్ మెడిసిన పత్రిక ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 

విశ్లేషించిన అంశాలు:

  • ఆస్ట్రాజెనికా లేదా కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారిలో కొందరికి పక్షవాతం, మెదడులో రక్తస్రావం ముప్పు స్వల్పంగా ఉంది.
  • వ్యాక్సిన్ తీసుకున్న 10 వేల మందిలో సగటు ఒకరు లేదా అంతకంటే తక్కువ మందిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. 
  • వ్యాక్సిన్ తో పోలిస్తే కరోనా కారణంగానే నాడీ సంబంధ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి..

Leave a Comment