నవంబర్ లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు..!

ఈరోజుల్లో చాలా మంది ఆన్ లైన్ బ్యాంకింగ్ మీదే ఆధారపడుతున్నారు. అయితే ఏదైన ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు జరపాలంటేనే బ్యాంకులకు వెళ్తున్నారు. అయితే వచ్చే నవంబర్ నెలలో బ్యాంకులకు వెళ్లే ముందు సెలవులు ఉండే రోజుల గురించి తెలుసుకోవడం మంచిది.

ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు చూసి భయపడిపోకండి.. ఎందకంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించదు.. రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా ఆయా తేదీల్లో బ్యాంకులు పనిచేయవు.. ఉదాహరణకు కర్ణాటక లో రాజ్యోత్సవం, ఛత్ పూజ వంటి పండుగలను జరుపుకుంటారు. ఆ పండులకు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి. 

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దీపావళి, కార్తీక పౌర్ణమి రెండు రోజులు మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వీటితో పాటు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు సెలవులు ఉన్నాయి.  అంటే తెలుగు రాష్ట్రాల్లో సాధారణ సెలవులతో కలిపి ఎనిమిది రోజులు సెలవులు వస్తాయి..కావున ఖాతాదారులు ఆయా తేదీలను బట్టి బ్యాంకింగ్ లావాదేవీలకు ప్లాన్ చేసుకోండి..

నవంబర్ లో తెలుగు రాష్ట్రాలు బ్యాంక్ హాలీడేస్ ఇవే..

నవంబర్ 4 – గురువారం(దీపావళి)

నవంబర్ 7 – ఆదివారం

నవంబర్ 13 – రెండో శనివారం

నవంబర్ 14 – ఆదివారం

నవంబర్ 19 – శుక్రవారం (కార్తీక పౌర్ణమి/ గురునానక్ జయంతి)

నవంబర్ 21 – ఆదివారం

నవంబర్ 27 – నాలుగో శనివారం

నవంబర్ 28 – ఆదివారం

    

Leave a Comment