ఆనందయ్య ‘కె’ మందుకు హైకోర్టు అనుమతి..!

కరోనా నివారణకు ఆనందయ్య ఇచ్చే ‘కె’ మందుకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. కరోనా బాధితులకు తక్షణమే ఈ మందు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. 

కరోనా నివారణ కోసం కంట్లో వేసే మందుకు సంబంధించి నివేదికాలు రావాల్సి ఉండటంతో గతంలో ఏపీ ప్రభుత్వం ఆనందయ్య ‘కె’ మందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ మందును కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. 

ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హానీ లేదని నివేదికలు తెలిపాయి. కాగా నెల్లూరు జిల్లా గొలగమూడిలో ఆనందయ్య మందు పింపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.  

 

Leave a Comment