ఏపీలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు.. 6 నుంచి 2 గంటల వరకు సడలింపు..

కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో అమలులో ఉన్న కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం పొడిగించింది. జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే జూన్ 10 తర్వాత కర్ఫ్యూ సమయాన్ని పెంచింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కర్ఫ్యూ యధాతథంగా నిర్వహిస్తారు.

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈనెల 10న ముగియనుండటంతో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలు కర్ఫ్యూను మరో పది రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. 

Leave a Comment