ప్రియుడి సంతోషం కోసం నర్సు నీచమైన పని.. ఏం చేసిందంటే..!

తన ప్రియుడి సంతోషం కోసం ఓ నర్సు నీచమైన పని చేసింది. ఇతర మహిళలు స్నానం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను ప్రియుడికి పంపింది. ఈ ఘటన బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెలుగుచూసింది. వివరాల మేరకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అశ్వని అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. 

ఆమె ప్రభు(31) అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. అశ్వని ఓ హాస్టల్ లో ఉంటోంది. ఆమె తన ప్రియుడి సంతోషం కోసం అదే హాస్టల్ లో ఉన్న బాత్ రూంలో కెమెరాను పెట్టింది. హాస్టల్  ఉన్న మహిళలు స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీసి ప్రియుడికి పంపించేది. ఈక్రమంలో స్నానానికి వెళ్లిన ఓ మహిళ బాత్ రూంలో రహస్యంగా ఉంచిన మొబైల్ ను గుర్తించింది. 

ఆ మొబైల్ ఫోన్ ను పరిశీలించగా వీడియో రికార్డు అవుతోంది. వెంటనే ఆ ఫోన్ ఓపెన్ చేసి చూడగా, మరికొందరి వీడియోలు కనిపించాయి. దీంతో షాక్ కు గురైంది. వెంటనే హాస్టల్ మేనేజర్ కు సమాచారం అందించింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నర్సును, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.    

Leave a Comment