వాల్ స్ట్రీట్ జనరల్ కథనం..క్లారిటీ ఇచ్చిన ఫేస్ బుక్..!

ప్రస్తుతం దేశంలో ఫేస్ బుక్ వ్యవహారంపై రగడ జరుగుతోంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శల యుద్ధానికి దిగారు. అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించిన కథనంపై ఈ దుమారం రేగింది. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్ బుక్ చూసీచూడనట్లుగా వదిలేస్తోందని ఈ కథనంలో ప్రచురించింది. బీజేపీ వైపు ఫేస్ బుక్ మొగ్గు చూపుతోందని పేర్కొంది.

వాల్ స్ట్రీట్ జనరల్ కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై ఫైర్ అయ్యరు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత్ లో ఫేస్ బుక్, వాట్సాప్ లను నియంత్రిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. వీటి ద్వారా తప్పుడు వార్తలను విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ విమర్శించారు. బీజేపీ ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తుందని, అమెరికా మీడియా ఈ నిజాన్ని బయటపెట్టిందని ట్వీట్ చేశారు. 

అయితే రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. తమ సొంతవారిని కూడా ప్రభావితం చేయలేని వారు ప్రపంచం మొత్తం బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ప్రభావితం చేస్తున్నాయని ఆరోణలు చేస్తున్నారంటూ విమర్శించారు. కేంబ్రిడ్జ్ ఎనలిటికా, ఫేస్ బుక్ నుంచి సమాచారం తీసుకొని ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన మీరు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఫేస్ బుక్ ఏం చెబుతోంది?

అయితే బీజేపీతో ఫేస్ బుక్ చేతులు కలిపిందన్న విమర్శలపై ఫేస్ బుక్ ఖండించింది. రాజకీయాలు, రాజకీయనేతలతో సంబంధం లేకుండా తమ విధానాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది. హింసను ప్రేరేపించే ద్వేషపూరిత కంటెంట్ ను తాము నిషేధించామని ఫేస్ బుక్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. 

 

Leave a Comment