గుడ్ న్యూస్ : కరోనా వైరస్ కు ఇంజెక్షన్ రెడీ..

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు హైదరాబాద్ కు చెందిన హెటిరో సంస్థ యాంటీ వైరస్ ఔషధం రెమ్ డెసివిర్ ను తయారు చేసింది. ఈ ఔషధాన్ని ‘కోవిఫర్’ ఇంజెక్షన్ ను విడుదల చేసినట్లు హెటెరో గ్రూప్ ప్రకటించింది. 

ఈ ఔషధం ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం భారత రెగ్యులేటర్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆప్ ఇండియా అనుమతి కూడా పొందినట్లు పేర్కొంది. రెమ్డిసివిర్ హెటెరో జెనరిక్ వెర్షన్ ను ‘కోవిఫర్’ అనే పేరుతో ఇండియాలో మార్కెట్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ ఇంజెక్షన్లను లక్షడోసుల మేర సిద్ధం చేశామని, సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించంది. 

రెమ్డిసివిర్ ఔషధాన్ని కరోనా లక్షణాలు లేదా పాజిటివ్ రోగులకు చికిత్స కోసం వినియోగించవచ్చు. ‘కోవిఫర్’ 100 ఎంజీ ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. వైద్యుల పర్యవేక్షణలో రోగులకు అందించవచ్చు. తక్కువ, మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాల్లోని ప్రజలకు కోవిడ్-19 చికిత్స చేయడంలో భాగంగా గిలిడ్ సైన్సెస్ ఐఎన్సీతో కుదుర్చుకున్న లైసెన్స్ ఒప్పందాన్ని అనుసరించి ఈ  ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 

కోవిడ్-19 రోగులకు తేలికపాటి నుంచి మోడరేట్ లక్షణాలు ఉన్న రోగుల చికిత్స కోసం ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో యాంటీ వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ ను ప్రారంభించడానికి గ్లెన్ మార్క్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చిన ఒక రోజు తర్వత హెటెరో ఇంజెక్షన్ రావడం గమనార్హం.. అయితే ఫాబిఫ్లూ మందు టాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉండగా, హెటెరో యొక్క ఔషధం ఇంజెక్షన్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. 

 

Leave a Comment