హీరో బాలకృష్ణకు సర్జరీ.. కారణం ఏమిటంటే?

టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలో చేరారు. బాలకృష్ణ కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో చికిత్స కోసం ఆయన అక్టోబర్ 31న బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి వెళ్లారు. గత ఆరు నెలలుగా ఆయన భజం నొప్పితో బాధపడుతున్నారు. ఆస్పత్రి వైద్యులు బాలకృష్ణకు సుమారు నాలుగు గంటల పాటు సర్జరీ చేశారు. 

ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యలు తెలిపారు. ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. గత ఆరు నెలలుగా బాలకృష్ణ భుజం నొప్పితో బాధపడుతుండటంతో ఆయన చికిత్స తీసుకున్నారు. కాగా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే తేదీని ప్రకటించనున్నారు.  

Leave a Comment