పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు.. సీసీ ఫుటేజ్ వీడియో వైరల్..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన అకాల మరణాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ పునీత్ మరణానికి కొద్ది క్షణాల ముందు సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

 శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్ కు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో వెంటనే భార్య అశ్వినితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఇంటికి వెళ్లారు. ఈసీజీ తీసే వరకు పునీత్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఈసీజీ నిర్వహించిన డాక్టర్ విక్రమ్ హాస్పిటల్ కు తరలించాలని రమణారావు సూచించారు. విక్రమ్ ఆస్పత్రిలో పునీత్ చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.  

ఈ సందర్భంగా పునీత్ కారులో కూర్చుని ఆఖరి క్షణంలో ఇంటి నుంచి వెళ్లిపోతున్న వీడియో రిలీజైంది. పునీత్, భార్య అశ్వీని కారు కీ కోసం అసిస్టెంట్ ని అడిగారు. అసిస్టెంట్ ఇంట్లోకి వెళ్లి కీ పునీత్ చేతిలోకి ఇస్తాడు. అయితే పునీత్ కారు వరకు తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్లి ఎక్కినట్లు కనిపిస్తుంది. తనకేమీ కాలేదని ఎలాంటి నొప్పి లేదని భార్యతో చెప్పారు. అనంతరం కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పునీత్ పడకున్నారు. ఐదు నిమిషాల ప్రయాణం తర్వాత విక్రమ్ ఆస్పత్రికి చేరేలోపు భార్య ఒడిలోనే పునీత్ కన్నుమూశారు. ప్రస్తుతం ఈ సీసీ టీవీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment