ఈ కోడి చికెన్ తప్ప ఏమి తినదు . !!

ఈ ఫోటో లోని కోడి పేరు మోటూ. ఈ కోడి ధనా బదులు చికెన్ తింటుంది .తన యజమాని చెప్పినట్లు వింటుంది . ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరు గ్రామంలోని తెలంగాణా చికెన్ సెంటర్ యజమాని ఇలియాస్ ఆ కోడిని పెంచుతున్నాడు . బ్రాయిలర్ కోళ్ళని దిగుమతి చేసి వాటిని చికెన్ రూపంలో ఇలియాస్ విక్రయించేవాడు .అయితే గత నెలలో వచ్చిన ఈ కోడి ఇలియాస్ కి నచ్చింది .

దానికి మోటూ అని ముద్దు పేరు పెట్టి దాణా బదులు చికెన్ ముక్కలు . స్కిన్ అలవాటు చేశాడు . ఇంకేం ఉంది మోటూ దాణా కి బదులు చికెన్ కి అలవాటు పడింది . ఆ కోడి యజమాని “మోటూ ఇద్దరు ఆవో ” అని పిలుస్తే చాలు వచ్చేస్తుంది . యజమాని వెంటే తిరుగుతూ .. ఆయన సైగలకు అనుగుణముగా నడుచుకుంటుంది . అయితే ఈ కోడి కి డిమాండ్ కూడా బాగా పెరిగింది . కొంత మంది 5000 రూపాయలు ఇస్తా అని అడిగిన ఇలియాస్ ఇవ్వనని చెప్పాడు .

Leave a Comment