ఇండియాలో కరోనా పై WHO సంచలన విషయాలు వెల్లడించింది .

కొవిడ్ కేసులు తగ్గుతున్నాయని చాలామంది జాగ్రత్తలు పాటించటం లేదు .నిర్లక్ష్యంగా ఉంటే తీవ్ర ముప్పు తప్పదని డబ్ల్యూహెచ్వో సూచించింది.మాస్కులు ధరించి కుండా, భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరగడం వేడుకల్లో పాల్గొనడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అయితే అయితే ఇండియాలో కరోనా కేసులు, మరణాలు ,17 నెలల పరిస్థితులు అన్ని గమనించాక ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సౌమ్య స్వామినాథన్ షాకింగ్ ప్రకటన చేశారు.

అదేంటంటే… ఇండియాలో… కరోనా స్థానిక స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది అన్నారు. ఈ స్థాయికి చేరటం  వల్లే తక్కువగా చెప్పుకోదగ్గ స్థాయిలో వ్యాధి ఉందని తెలిపారు.ఈ ప్రకటన భారతీయులకు ఆందోళన కలిగించేదే ..ఎందుకంటే Endemicity స్థాయి అనేది ఇబ్బందికరమైనది.ఏదైనా వ్యాధి విదేశాల నుంచి వస్తే అది కొన్నాళ్లకు వెళ్ళిపోతుంది దానితో సమస్య కొంతకాలమే ఉంటుంది .అలా కాకుండా ఇలా స్థానిక స్థాయికి చేరితే ఆ వ్యాధి ఎప్పటికీ పోదు అలాగే ఉంటుంది. జలుబు ,జ్వరం ,దగ్గు ఎలాగైతే రెగ్యులర్గా ఉంటాయో అలాగే ఉంటుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే కరోనా ఇక ఎప్పటికీ ఇండియాలో ఉంటుంది దానితో మనం సహజీవనం చెయ్యక తప్పదు అన్నది డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చెప్పుకొచ్చారు. కరోనా నిజంగానే ఇండియా లో స్థానిక స్థాయికి చేరి ఉంటే …దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలి అది లేని చోటు ఉంటుంది అనుకోలే0.అంటే ఎక్కువ మంది ప్రజలకు సోకుతుందని ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుందని అర్థం .ఆ ప్రకారమే ఇండియా ఎపిడమిక్ దాటేసింది.అందుకే ఇప్పుడు స్థానిక స్థాయికి వచ్చేసింది అని డాక్టర్ సౌమ్య అంటున్నారు.

Leave a Comment