పరువు హత్య..ఇద్దరిదీ అగ్రకులమే… కానీ..

 తెలంగాణలో మరో పరువు హత్య కలకలం రేపింది..కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో అమ్మాయి తండ్రి తన బంధువులతో కలిసి అల్లుడిని హత్య చేశాడు.. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ హత్య హైదరాబాద్ లో జరిగిన ప్రణయ్ హత్య ఉదంతాన్ని తలపించింది.

చందానగర్ కు చెందిన అవంతి, హేమంత్ కుమార్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఒప్పుకోలేదు. దీంతో ఇంటి నుంచి పారిపోయి జూన్ 10న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కాగా, లక్ష్మారెడ్డి మాత్రం తన కూతరు జూన్ 10 నుంచి కనబడడంలేదని చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు..అయితే కూతురు పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన లక్ష్మారెడ్డి.. అల్లుడు హేమంత్ ని తసుకెళ్లి హత్య చేశాడు.. ఈ హత్యలో ప్రధాన సూత్రధారి యుగేందర్ రెడ్డితో పాటు 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఇద్దరిదీ అగ్రకులమే..

అయితే ఇక్కడ అవంతి, హేమంత్ ఇద్దరిదీ అగ్రకులమే.. అవంతిది రెడ్డి సామాజిక వర్గం అయిదే హేమంత్ ది వైశ్య సామాజిక వర్గం..ఇద్దరిదీ అగ్రకులమే అయిన హోదాలోనే తేడా ఉంది. అవంతి తండ్రి కోటీశ్వరుడు..వ్యాపారంగా, రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి..

కాగా, హేమంత్ ది మధ్య తరగతి కుటుంబం.. సొంతిల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నారు. హేమంత్ తమ్ముడు లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. హేమంత్ కూడా ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. హేమంత్ ని హత్య చేయడానికి కులం ఒక కారణం అయితే.. డబ్బు, హోదా లేదనే అక్కసు ఇంకొకటి.. ఇవి అవంతి జీవితంలో విషాదాన్ని మిగిల్చాయి. 

 

 

Leave a Comment