కుండపోతవానలోనూ కర్తవ్యాన్ని వదలని ఖాకీ..!

ఓ వైపు భారీ వర్షం కురుస్తోంది..అయినా తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. ఇంత భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా డ్యూటీ చేసిన కానిస్టేబుల్ దేవిశెట్టి శ్రీనివాస్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. 

క్రిష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎప్పుడు ట్రాఫిక్ తో రద్దీగా ఉంటుంది. నాలుగు వైపుల నుంచి వాహనాలు రద్దీగా వస్తుంటాయి. ఈ రద్దీకి తోడు శుక్రవారం సాయంత్రం ఒక్కసారీగా భారీ వర్షం కురిసింది. అక్కవ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ట్రాఫిక్ ని కంట్రోల్ చేశాడు. దీంతో శ్రీనివాస్ ను హోంమంత్రి, డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. 

 

Leave a Comment