శ్రౌత శైవ సాంప్రదాయం ప్రకారం బాలు అంత్యక్రియలు..!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని తామరైపాక్కం ఫాంహౌస్ లో అంతిమ సంస్కారాలు జరిగాయి. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీ బాలు అంత్యక్రియలను శ్రౌత శైవ ఆరాధ్య సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. అంటే ఈ సంప్రదాయం ప్రకారం మనిషిని దహనం చేయరు..ఖననం చేస్తారు.. అది కూడా కూర్చున్న పొజిషన్ లో మనిషి కూర్చుని కాళ్లు చాపుకున్నట్లు ఉంటాడు. ఆ పొజిషన్ లో ఖననం చేస్తారు. అంతకు ముందు కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా వైదిక క్రతువు పూర్తి చేశారు. 

ఇక ఏపీ ప్రభుత్వం తరపున బాలు అంత్యక్రియల్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, మనో, ఇతర ప్రముఖులు చవరి చూపుచూసి కన్నీటి పర్యంతం అయ్యారు. తమిళనాడు ఆరోగ్య మంత్రి, తమిళ సూపర్ స్టార్ విజయ్ అంత్యక్రయల్లో పాల్గొన్నారు. అంతకుముందు బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఫాంహౌస్ కు చేరుకున్నారు.  

Leave a Comment