సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో ఎవరిదో గుర్తుపట్టారా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. బాలివుడ్ వెటరన్ హీరోయిన్ హేమా మాలిని ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో హేమా మాలిని దేవతగా కనిపిస్తోంది. హేమా మాలిని సినిమాల్లోకి రాకముందు 14,15 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తమిళ మ్యాగజైన్ కు ఫొటో షూట్ చేసింది. ఏవీఎం స్టూడియోలో జరిగిన ఆ ఫొటో షూట్ లో ఆమె దేవతగా వేషం వేసుకుని ఉన్నారు. 

అయితే ఈ ఫొటో హేమా మాలినికి బాగా నచ్చిన ఫొటో.. ఈ ఫొటో కోసం ఆమె చాలా సంవత్సరాల నుంచి వేదికారు. కానీ అది లభ్యం కాలేదు. ఇటీవల ఈ ఫొటో కోసం వెతుకగా ఇది లభించింది. దానిని హేమా మాలిని తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.  2017లో తన బయోగ్రఫీ పుస్తకం ‘బియాండ్ ది డ్రీమ్ గర్ల్’లో ఆ ఫొటోను వాడుదామనుకుంది. కాకపోతే ఆ ఫొటో అప్పుడు లభ్యం కాలేదు. అయితే ఇప్పుడా ఫొటో దొరకడం సంతోషంగా ఉందని హేమా మాలిని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment