గ్రామ సచివాలయ సిబ్బందికి యూనిఫాం..!

ఏపీలో గ్రామ సచివాలయ సిబ్బందికి డ్రస్ కోడ్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పైలట్ సచివాలయాల కింద కొన్నింటిని గుర్తించి ముందుగా అక్కడి సిబ్బందికి డ్రస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించింది. అక్కడి సిబ్బంది నుంచి, ఆ సచివాయాల పరిధిలోని ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా మిగిలిన సచివాలయాల్లో కూడా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 

 పురుస ఉద్యోగులకు స్కై బ్లూ షర్ట్, బిస్కెట్ కలర్ ప్యాంట్, మహిళా ఉద్యోగులకు స్కై బ్లూ టాప్, బిస్కెట్ కలర్ లెగిన్ డ్రస్ కోడ్ ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఒకటి రెండు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపక చేయనుంది. అక్కడ ఒకటి రెండు సచివాలయాలకు డ్రస్ కోడ్ అమలు చేస్తుంది. డ్రస్ కోడ్ పట్ల సానుకూల స్పందన వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. 

ఇక డ్రస్ కోడ్ తో పాటు వారికి ఇచ్చే ఐడెంటిటీ కార్డుల ట్యాగ్ కలర్ లను కూడా ప్రత్యేకంగా రూపొందించనుంది. ఒక్కో కార్యదర్శికి ఒక్కో కలర్ ట్యాగ్ ఇచ్చే వషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని అడ్మిన్ సెక్రటరీ, గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ సెక్రటరీలకు ఎల్లో ట్యాగ్, డిజిటల్ అసిస్టెంట్ కు రెడ్ ట్యాగ్, హెల్త్ సెక్రటరీకి వైట్ ట్యాగ్, మహిళా పోలీసులకు ఖాకీ ట్యాగ్, వీఆర్ఓకు బ్రౌన్ ట్యాగ్, అగ్రికల్చర్ లేదా హర్టీ కల్చరల్ సెక్రటరీకి గ్రీన్ ట్యాగ్, ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఆరెంజ్ ట్యాగ్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ కు గ్రే ట్యాగ్ ఇవ్వనుంది. అంతే కాదు గ్రామ వాలంటీర్లకు కూడా డ్రస్ కోడ్ అమలు చేసేందుకు చర్చ జరుగుతోంది..

 

Leave a Comment