రాగల 3 రోజల పాటు భారీ వర్షాలు..!

ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం అల్పపీడన ప్రభావంతో రాగల 3 రోజులపాటు  రాష్ట్రంలో  అక్కడక్కడ భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు పేర్కొన్నారు. భారీ వర్షాలు,  వరద ఉదృతి  దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కీ.మీ వెగంతో గాలులు వీస్తాయని, అలలు 3.5 నుండి 4.3 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పారు. సముద్రం అలజడిగా  ఉంటుందని, మత్స్యకారులు  సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. 

రాగల 3 రోజుల వాతావరణ వివరాలు..

ఆగష్టు 16 వ తేది –  విశాఖ, తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. 

ఆగష్టు 17వ తేది –  విజయనగరం, విశాఖ జిల్లాలో అక్కడక్కడ  భారీ వర్షాలు పడే అవకాశం, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. 

ఆగష్టు 18వ తేది –  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం.

 

Leave a Comment