ప్రపంచం కంట కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో.. హార్ట్ బ్రేకింగ్ సన్నివేశం..!

గల్ఫ్ దేశాల్లో ఒకటైన సిరియాలో పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.. ప్రభుత్వ దళాలు, ఉగ్రవాదులకు మధ్య నిత్యం పోరు జరుగుతూనే ఉంటుంది. ఈ పోరులో ఎంతో మంది సామాన్యులు బలవుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది కాళ్లు, చేతులు పోగొట్టుకుని నరకయాతన చెందుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియక సామాన్యజనం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తున్నారు. 

అలా ప్రమాదంలో గాయపడిన వారిలో ముంజీర్ ఒకరు.. సిరియాలో జరిగిన బాంబుదాడిలో ముంజీర్ ఒక కాలును పూర్తిగా కోల్పోయాడు. దురదృష్టం ఏంటంటే అతడి కుమారుడు మాత్రం రెండు కాళ్లు లేకుండా జన్మించాడు. రెండు కాళ్లు లేని కుమారుడిని ముంజీర్ ఆడిస్తున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో సియానా ఇంటర్నేషనల్ ఫొటో అవార్డ్స్ 2021లో ఎంపికైంది. ‘హార్డ్ షిప్ ఆఫ్ లైఫ్’ పేరుతో టర్కీ ఫొటోగ్రాఫర్ ఈ ఎంపికలో పాల్గొన్నాడు. టర్కీలోని హటే ప్రావిన్స్ లోని రెహాన్లీ జిల్లాలో సిరిమా సరిహద్దుకు సమీపంలో తీశారు. కాలు లేని తండ్రి రెండు కాళ్లు లేని కొడుకుని ఆడిస్తున్న ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. 

Leave a Comment