ఇలాంటి ఒత్తిడితోనే హార్ట్ ఎటాక్ వస్తుంది.. నిర్లక్ష్యం వద్దు..!

ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు పెరిగిపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేవి. ఇప్పుడు చిన్న వయస్సులోనే వస్తున్నాయి. గుండె జబ్బులు రావడానికి మన జీవినశైలిలో మార్పులే కారణమవుతున్నాయి. చాలా వరకు ఒత్తిడికి గురికావడం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె జబ్బులకు కారణమయ్యే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హార్ట్ ఎటాక్ ముఖ్యంగా ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు, నీరసం కారనంగా వస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. స్ట్రోక్ ఎక్కువగా పురుషుల్లోనూ, మహిళల్లోనూ పెరిగిందని యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ తెలిపింది. అదేవిధంగా డయాబెటీస్, ఆర్టెరీల్ హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, స్మోకింగ, ఒబిసిటీ, ఫిజికల్ ఇన్ యాక్టివిటీ వలన కార్డియో వాస్క్యులర్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందిన పరిశోధకులు గుర్తించారు. ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కూడా కార్డియో వాస్క్యులర్ సమస్యను పెంచుతాయని తేలింది. 

సామాన్యంగా మహిళల కంటే పురుషుల్లో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్ అధికంగా ఉంటుంది. కానీ పరిశోధనల్లో మహిళల్లో కూడా ఈ రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మహిళల్లో నిద్రలేమి, ఒత్తిడి సమస్యలు, అలసట, నీరసం కారణంగా హార్ట్ ఎటాక్ సమస్య వస్తున్నట్లు తేలింది. ప్రతి ఒక్కరూ ఒత్తిడి చూసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. 

Leave a Comment