షాకింగ్ వీడియో: జిమ్ లో 33 ఏళ్ల యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు..!

చావు ఎప్పుడు.. ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. మరణం అనేది తప్పించుకోలేని సత్యం..ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. రెప్పపాటులో ప్రాణాలు కోల్పోవచ్చు.. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. బెంగళూరులోని ఓ జిమ్ లో 33 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. 

వివరాల మేరకు బనశంకరిలోని గోల్డ్స్ జిమ్ లో ఓ 33 ఏళ్ల యువకుడు వర్కవుట్స్ చేసి బయటకు వచ్చాడు. అతనికి ఏదో నొప్పిగా అనిపించడంతో అక్కడున్న మెట్లపై కూర్చున్నాడు. గుండెల్లో మంటగా అనిపించడంతో లోనికి వెళ్లి.. నీళ్లు తెచ్చుకుని తాగాడు. తర్వాత మళ్లీ మెట్లపైనే కూర్చున్నాడు. తర్వాత గుండెపై చేయి వేసుకుని అమాంతం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆగస్టు 25, 2021న ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం ఆ యువకుడిని అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండె ఆగిపోవడం వల్లే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు యువకులు జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment