గడ్డంతో ఆరోగ్య ప్రయోజనాలు..!

గడ్డం అంటే ఒకప్పుడు చిరాకు పడేవారు. కానీ ఇప్పుడు కొందరికి గడ్డం ఒక ఫ్యాషన్ సింబల్.. అయితే గడ్డం ఫ్యాషన్ మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నట్లు ఇంగ్లండ్ లోని సండర్ ల్యాండ్ యూనివర్సిటీకి చెందిన సర్జికల్ డాక్టర్ కరణ్ రంగార్జన్ వెల్లడించారు. కరణ్ టిక్ టాక్ వీడియోల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా గడ్డం ఉపయోగాల గురించి మాట్లాడారు. టిక్ టాక్ లో ఆయన చేసిన వీడియో వైరల్ గా మారింది. లక్షల వ్యూస్ తో దూసుకుపోతుంది. గడ్డం గురించి కరణ్ చెప్పింది విన్న తర్వాత నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గడ్డం వెనకాల ఇంత కథ ఉందా అని అభిప్రాయపడుతున్నారు. 

డాక్టర్ కరణ్ ఏం చెప్పారంటే..

  • ముఖం నున్నగా, క్లీన్ షేవ్ తో ఉండటం కంటే కాస్త గడ్డం పెంచుకోవడమే మంచిది. 
  • ఒక పరిశోధన ప్రకారం ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందిలో గడ్డంతో ఉన్న వారి కంటే గడ్డం లేనివారి ముఖంపై ఎంఆర్ఎస్ఏ అనే బ్యాక్టీరియా ఉండేందుకు మూడు రెట్లు ఎక్కువ అవకాశం ఉంది.
  • క్లీన్ షేవ్ చేసుకునే సమయంలో చర్మం రాపిడికి గురై సూక్ష్మమైన పగుళ్లు ఏర్పడతాయి. అక్కడ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. క్లీన్ షేవ్ కంటే కాస్త గడ్డం పెంచితే ఈ బ్యాక్టీరియా పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.  
  • గడ్డం వల్ల ముఖంపై చర్మం సూర్యుని అతినీలలోహిత కిరణాల బారినపడకుండా ఉంటుంది. తద్వారా చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. 

 

Leave a Comment