బిపిన్ రావత్ మృతి ఘటన.. మన సైన్యాన్ని అవహేళన చేసిన చైనా..!

డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన నేపథ్యంలో చైనా వక్రబుద్ధిని బయటపెట్టింది. భారత సైన్యాన్ని అవహేళన చేస్తూ మాట్లాడింది. ఇండియన్ ఆర్మీకి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత కూడా లేదని వ్యాఖ్యానించింది. పలువురు సైనిక నిపుణుల అభిప్రాయాలతో ప్రభుత్వ రంగ వార్తాసంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ ఈ మేరకు కథనాన్ని ప్రచురించింది. 

భారత జవానులు ప్రామాణిక నిర్వహణ విధానాలను పాటించారని కథనంలో పేర్కొంది. భారత బలగాలకు క్రమశిక్షణ లేదని చెప్పింది. హెలికాప్టర్ ప్రమాదం మానవతప్పిదం వల్ల జరిగిందని, గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు భారత్ లో జరిగాయని తెలిపింది. వాతావరణ మెరుగుపడేంత వరకు ప్రయాణాన్ని వాయిదా వేసినా.. హెలికాప్టర్ ని పైలట్ మరింత నైపుణ్యంతో నడిపినా.. క్షేత్ర స్థాయిలో మరన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రమాదం జరిగేది కాదని అందులో పేర్కొంది. 

  

Leave a Comment