ఆ క్లినిక్ లో ‘ఒక్క రూపాయికే వైద్యం’..

పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆ డాక్టర్ ఓ క్లినిక్ ను ప్రారంభించాడు. ఆ క్లినిక్ లో ఒక్క రూపాయికే పేదలకు వైద్యం అందిస్తున్నాడు. ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో సురేంద్ర సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లో శంకర్ రామచందాని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు.

ఆయనకు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న ఆశయం ఉంది. ఈనేపథ్యంలో డాక్టర్ శంకర్ రామ్ చందాని ఈనెల 12న బుర్లా పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ఒక రూపాయికే వైద్యం పేరుతో క్లినిక్ ప్రారంభించారు. తన పనిగంటలు మినహాయించిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి 8 గంటలు, తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు పేదవారి కోసం క్లినిక్ లో సేవలందిస్తున్నారు. 

తాను పనిచేసే ఆస్పత్రిలో పేదలు, వృద్ధులు, దివ్వాంగులు వస్తుంటారని, గంటల కొద్ది క్యూలైన్ లో వేచి ఉంటారని డాక్టర్ శంకర్ తెలిపారు. అలాంటి వారందరికీ తన క్లినిక్ లో చికిత్స చేస్తున్నానని చెప్పారు. ఈ రూపాయి కూడా పేదలకు తాము ఉచితంగా సేవ చేసుకుంటున్నామనే భావన ఉండకూడదనే తీసుకుంటున్నాని ఆయన పేర్కొన్నారు. 

 

 

 

Leave a Comment