చికెన్ పేరు వినగానే కోమా నుంచి కోలుకున్నాడు..!

చికెన్ పేరు వినగానే రెండు నెలలుగా కోమాలో ఉన్న వ్యక్తి కోలుకున్నాడు. వినడానికి ఇది కొంచం వింతగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన తైవాన్ లో చోటుచేసుకంది. తైవాన్ కు చెందిన చియు అనే యువకుడు రెండు నెలల క్రితం స్కూటర్ పై నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లాడు. దీంతో అతడు ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమంటూ డాక్టర్లు తేల్చి చెప్పేశారు. 

దీంతో చియు ఎప్పుడు కోలుకుంటాడేమోనని అతని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చేసుకునేవారు. అతడు కోమాలోకి వెళ్లి 62 రోజులు గడిచిపోయాయి. ఈక్రమంలో చియును చేసేందుకు అతడి సోదరుడు ఆస్పత్రికి వచ్చాడు. ఆ సమయంలో చియు సోదరుడు ‘ చియు నేను నీకు ఇష్టమైన చికెన్ ఫిల్లెట్స్ తినబోతున్నాను’ అని తెలిపాడు. అంతే ఆ పేరు వినగానే రెండు నెలలుగా కోమాలో ఉన్న చియుకు స్పృహ వచ్చింది. వెంటనే పరీక్షించిన వైద్యులు అతడు కోలుకున్నట్లు తెలిపారు. 

Leave a Comment