బైడెన్ ఓ గజిని.. సంవత్సరంలో చనిపోతాడు : కంగనా

బాలీవుడ్ నటి కంగానా రనౌత్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను ‘గజిని’తో పోలుస్తూ ట్వీట్ చేశారు. బైడెన్ ఐదు నిమిషాల్లో ఏంజరిగిందో మర్చిపోతాడని, ఎన్ని మందులేసిన ఆయన ఒక సంవత్సరం కంటే ఎక్కవ బతకరని పేర్కొన్నారు. ఆ తర్వాత షో మొత్తం కమలా హ్యారిస్ నడుపుతారని ట్వీట్ చేసింది. 

ఇక భారత సంతతి సెనేటర్ కమలా హ్యారీస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడంపై కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేసింది. ఒక మహిళ ఎదిగినప్పుడు ఆ మహిళ ఇతర మహిళలకు మార్గాన్ని చూపిస్తుందని ప్రశంసించింది. కాగా కంగనా రనౌత్ ఇటీవల ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.  

Leave a Comment