ఐపీఎల్ బెట్టింగ్ ప్రాణం తీసింది.. పురుగుల మందు తాగిన అన్నాదమ్ములు..!

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న ఇద్దరు అన్నాదమ్ములు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్యకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు మరణించగా, మరొకరి పరిస్థితి విషమయంగా ఉంది. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడులో చోటుచేసుకునింది. 

పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర సురేష్, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరు క్రికెట్ బెట్టింగ్ లో లక్షల రూపాయలు నష్టపోయారు. డబ్బులు చెల్లించాలని బెట్టింగ్ నిర్వాహకుడు ఒత్తిడి చేయడంతో  రూ.30 వేలు చెల్లించారు. అయితే మిగితా రూ.80 వేలు కూడా చెల్లించాలని నిర్వాహకుడు పట్టుబట్టాడు. 

దీంతో ఇద్దరు కలిసి బెల్లంకొండలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. ‘మేము క్రికెట్ బెట్టింగ్ లో రూ.లక్షల్లో నష్టపోయాము. డబ్బులు చెల్లించాలని బెట్టింగ్ నిర్వాహకుడు ఒత్తిడి తేవడంతో చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగుతున్నాం’ అంటూ ఓ సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్ లో బంధువులకు షేర్ చేశారు. 

విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందగా, కొమురయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Leave a Comment