చార్మీ పెంపుడు కుక్క ‘బేబీ బాయ్’తో ప్రభాస్..

సినీ నటి, నిర్మాత చార్మి కౌర్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. తన పెంపుడు కుక్క ‘బేబీ బాయ్’ తో సోఫాపై డార్లింగ్ ప్రభాస్ కూర్చున్న ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. ‘డార్లింగ్ విత్ మై 9 మంత్స్ ఓల్డ్ బేబీ బాయ్’ అని కామెంట్స్ చేశారు.  ఈ పెంపుడు కుక్క అరుదైన జాతికి చెందినది. దీనిని అమెరికాలోని అలాస్కా నుంచి తెప్పించారు. ఇది అరుదైన ‘మూలమ్యూట్’ జాతికి చెందిన కుక్క. 

ఈ ఫొటోలో ప్రభాస్ నల్లటి దుస్తులలో కనిపిస్తున్నాడు. బేబీ బాయ్ పై చేయి వేసి చిరునవ్వు నవ్వుతూ ఉన్న ఫొటో అభిమానులను తెగ ఆకట్టుకుటుంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి అరుదైన ఫొటో షేర్ చేసినందుకు చార్మీ, పూరీ జగన్నాథ్ లకు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు.  ప్రభాస్, చార్మీ కలిసి 2005 లో చక్రం, 2006లో ‘పౌర్ణమి’ సినిమాల్లో నటించారు. 

 

 

View this post on Instagram

 

#Darling with my 9 months old baby boy ♥️ . . . @actorprabhas #alaskanmalamute @puriconnects

A post shared by Charmmekaur (@charmmekaur) on

Leave a Comment