అబుదాబిలో తొలి హిందూ ఆలయం ఫైనల్ డిజైన్ ఇదే..!

అబుదాబిలో నిర్మించనున్న తొలి హిందూ ఆలయం నమూనాను ఆలయ నిర్వాహకులు విడుదల చేశారు. భారతీయ ఇతిహాసాలు, పురాణ గాథలు, గ్రంథాలతో ఆలయ గోడలు రూపుదిద్దుకోనున్నాయి. గత ఏడాది ఏప్రిల్ లో ఈ భారీ హిందూ దేవాలయానికి శంకుస్థాపన చేశారు. తర్వాత డిసెంబర్ లో నిర్మాణ పనులు చేపట్టారు. ప్రపంచ శాంతి, సామసరస్యాల కోసం తలపెట్టిన ఈ ఆలయాన్ని ‘ఆధ్యాత్మిక ఒయాసిస్సు’ గా నిర్వాహకులు పేర్కొంటున్నారు.

 ఆలయం యొక్క తుది నమూనా వీడియోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో లైబ్రరీ, ఓ క్లాస్ రూమ్, కమ్యూనిటీ హాల్, ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మెట్లపై జలపాతం మాదిరిగా నిర్మాణం చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రతా స్తంభాలపై భారత భౌగోళిక స్వరూపం, హిందూ ధర్మంపై కథలను రూపొందించనున్నారు. ఇందులో మహాభారతం, రామాయణంతో పాటు పురాణాలు, ప్రాంతీయ చరిత్రలు ఉంటాయి. 

 

 

Leave a Comment