పెళ్లి వద్దని దాన్ని కోసేసుకున్నాడు..!

తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తన పురుషాంగాన్నే కోసేసుకున్నాడు ఓ యువకడు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో సోమవార చోటుచేసుకుంది. వివరాల మేరకు జిల్లాలోని గాంధీనగర్ కు చెందిన మురగన్ తన కుమారుడు విజయరాఘవన్(23)కు పెళ్లి చేయాలని భావించాడు. 

అయితే ఈ విజయరాఘవన్ కు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మరో రెండేళ్ల వరకు తనను వదిలేయాలని తల్లిదండ్రులకు చెప్పాడు. అయినా వినకుండా అతని కుటుంబ సభ్యులు ఓ యువతితో వచ్చేవారం నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. 

పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని విజయరాఘవన్ తప్పించుకునేందుకు ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉలితో తన పురుషాంగాన్ని కోసుకున్నాడు. తను ఇక పెళ్లికి పనికిరానంటూ కేకలు వేశాడు. ఈ హడావుడిలో చేతిలో ఉన్న ఉలి గొంతుకు తగలడంతో అక్కడా తీవ్రంగా గాయమైంది. కుటుంబ సభ్యులు అతడ్ని ఆత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. 

Leave a Comment