‘ఆర్ఆర్ఆర్’ కొత్త పోస్టర్ పై వైరల్ అవుతున్న మీమ్స్..!

31
RRR new poster

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ నుంచి వచ్చిన కొత్త పోస్టర్ తాజా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే బైక్ పై చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. చాలా మంది ఈ ఫొటోను తమకు నచ్చినట్లు మార్ఫింగ్ చేసుకుంటున్నారు. 

ఈ ఫొటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమదైన శైలిలో వాడుకున్నారు. బైక్ పై వెళ్తున్న ఎన్టీఆర్, చెర్రీకి హెల్మెట్లు పెట్టి ఇప్పుడు పర్ ఫెక్ట్ గా ఉందంటూ ట్వీట్ చేసింది. హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి అంటూ తమ ట్రేడ్ మార్క్ నినాదాన్ని క్యాప్షన్ గా ఇచ్చారు. ఈ ట్వీట్ పై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికి అది పరిపూర్ణంగా లేదని, నెంబర్ ప్లేట్ మిస్సయిందని కామెంట్లు పెట్టారు. 

ఇక కొందరు వైసీపీ అభిమానులు అయితే రామ్ చరణ్ స్థానంలో ఏపీ సీఎం జగన్ ఫొటో పెట్టారు. ఇప్పుడు పర్ ఫెక్ట్ గా ఉందని ఆ ఫొటోకు క్యాప్షన్ జత చేశారు. 

క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా మినహాయింపు కాదు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ స్థానంలో విలియమ్సన్, రామ్ చరణ్ స్థానంలో తాను ఉన్నట్లు ఉన్న ఓ ఫొటోను వార్నర్ తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. వీరిద్దరు ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్నారు. 

 

Previous articleT20 WorldCup 2021: అక్టోబర్ 17 నుంచి ఆరంభం..!
Next articleపెళ్లి వద్దని దాన్ని కోసేసుకున్నాడు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here