నటుడు అజయ్ భార్యను ఎప్పుడైనా చూశారా..?

నటుడు అజయ్.. తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించాడు. విలన్ గా తనకంటూ ఓ ఈమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశముదురు, ఛత్రపతి వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోలకు ఫ్రెండ్ గా, విలన్ గా అనేక పాత్రలు పోషించాడు. తెలుగు సినిమా స్టార్ హీరోలతో నటించడంతో పాటు తాను కూడా హీరోగా ఒకటి రెండు సినిమాలు చేశాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.. 

టీనేజ్ లో ఉన్నప్పుడు తాను చాలా తప్పులు చేశానని గుర్తు చేసుకున్నాడు. 19 ఏళ్ల వయస్సులో ఇంట్లో డబ్బులు తీసుకుని ఫ్రెండ్ తో కలిసి నేపాల్ పారిపోయాడట. అక్కడ మూడు నెలలు సరదాగా గడిపిన తర్వాత వారి వద్ద డబ్బులు అయిపోవడంతో హోటల్ లో పనిచేయాల్సి వచ్చింది. డబ్బు సమకూర్చుకున్నాక తిరిగి ఇంటికి వచ్చానని చెప్పాడు. 

కాలేజీ రోజుల్లో శ్వేత రావురిని ప్రేమించి ఇంట్లో తెలియకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నానని, తర్వాత ఇంట్లో వాళ్లను ఒప్పించి మరోసారి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం వారికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు.

అజయ్ భార్య శ్వేత 2017లో జరిగిన మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో పాల్గొని ఫైనల్ రౌండ్ కు ఎంపికయ్యారు. 2018లో అంబాసిడర్ మిస్టర్ అండ్ మిస్టర్స్ సౌత్ ఇండియాగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 

Leave a Comment