జైలు మరుగుదొడ్డిలో సొరంగం తవ్వీ ఖైదీలు పరార్..!

148

సాధారణంగా జైలులో కరడుగట్టిన నేరస్థులు  ఉంటారు. అయితే వారి కోసం జైలు చుట్టూ భారీ బందోబస్తు ఉంటుంది. అయితే ఇవన్నీ తమననేం చేయవని నేరస్థుడు ,దొంగలు నిరూపించారు.ఒక చిన్న వస్తువు దొరికితే చాలు వాటితో ఎలాగైనా తప్పించుకోవచ్చు అని చేసి చూపించారు. ఒక చిన్న చెంచా తో జైలుగోడల నూనె వేసి బయట వరకు సొరంగం తవ్వారు. ఆ సొరంగ మార్గం నుంచి జైలు నుంచి బయటకు వచ్చారు. సాధారణంగా ఇటువంటి సన్నివేశాలు సినిమాలలో చూస్తూ ఉంటాం. ఉదాహరణకి జులాయి సినిమాలో బ్రహ్మానందం ఒక ప్లేటు సహాయంతో గోడని ఎందుకు ప్రయత్నించడం నవ్వు పుట్టిస్తుంది. అయితే ఇటువంటి ఘటనే ఇజ్రాయెల్లో చోటుచేసుకుంది.

 

దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇజ్రాయిల్ లో గిల్బోవా జైలు ఉంది. ఆ జైలులో కరుడుగట్టిన నేరస్థులను బందీగా ఉంచుతారు. ఆ జైలు బయట లోపల చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అయినా కూడా ఆరుగురు ఖైదీలు భద్ర దళాల కళ్లుగప్పి జైలు నుంచి పారిపోవడం జరిగింది.

అయితే జైలు నుంచి పారిపోవడానికి వాళ్ళు ఉపయోగించిన ఒకే ఒక ఆయుధం తుప్పుపట్టిన చెంచా. వారు బందీగా ఉన్న జైలు గదిలోని మరుగుదొడ్డిలో ఖైదీలు తుప్పుపట్టిన చెంచాతో సొరంగం తవ్వకం మొదలు పెట్టారు. ఈ పని వీళ్ళు కొన్నేళ్లుగా అలా చేశారని ఇప్పుడు నా సమాచారం. అయితే చివరకి సొరంగం పూర్తవడంతో సోమవారం ఖైదీలు జైలు నుంచి పరార్ అయ్యారు.

 

జైలు నుంచి బయటకు వచ్చి పొలాల వెంట పారిపోతుండగా రైతులకు కనిపించారట. ఖైదీలు జైలు నుంచే పరారయ్యారని గుర్తించి వెంటనే జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు .దీంతో అధికారులు జైలులో గాలించగా ఆరుగురు పరారయ్యారని తేలింది. పారిపోయిన వారిలో మాజీ మిలిటెంట్ నాయకుడు ఉన్నాడు. మిగితా ఐదుగురు గాజా కు చెందిన ఇస్లామిక్ జిహాద్ కు చెందినవారుగా అధికారులు తెలిపారు. అయితే వీళ్ళు ఓవైపు వెళ్లి ఉంటారని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

Previous articleనటుడు అజయ్ భార్యను ఎప్పుడైనా చూశారా..?
Next articleబాలిక ప్రాణం బలిగొన్న రూపాయి నాణ్యం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here