బిగ్ బాస్-5 కోసం నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సీజన్ లో 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మూడు, నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సీజన్లలో నాగార్జునకు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో  ఐదో సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా తీసుకుంది బిగ్ బాస్ టీమ్..

అయితే బిగ్ బాస్ ఐదో సీజన్ కు నాగార్జున రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీకెండ్ లో ప్రసారమయ్యే ఒక్కో ఎపిసోడ్ కి సుమారు రూ.12 లక్షలు తీసుకునేవారు. కానీ ఈ సీజన్ కు రూ.12 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. నాగార్జున తన రెమ్యునరేషన్ ను ఇంత భారీ మొత్తంలో డిమాండ్ చేయడంతో చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తమ షోను విజయవంతం చేసేందుకు ఆయన అడిగినంత ఇచ్చేందుకు నిర్వాహకులు ఒకే చెప్పారట.. 

Leave a Comment