‘హనుమాన్ జయంతి’.. స్పెషల్ వీడియో షేర్ చేసిన చిరంజీవి..!

హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. రామ్ చరణ్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు తీసిన వీడియో అది. సిద్ధ పాత్ర కోసం రామ్ చరణ్ తన కాటేజీలో సిద్దమవుతున్నప్పుడు అక్కడికి ఒక వానరం వచ్చింది. మేకప్ వేసుకుంటున్న చరణ్ ని ఆ వానరం చూస్తుంది. 

రామ్ చరణ్ చూడగానే ఆ కోతి పక్కకు వెళ్లిపోవడానికి చూస్తుంది. కానీ రామ్ చరణ్ బిస్కెట్ ప్యాకెట్ చూపించటంతో దగ్గరకు వచ్చి సోఫాలో కూర్చుంటుంది. చరణ్ ఆ వానరానికి ఒక బిస్కెట్ ఇస్తాడు. ఆ వానరం బిస్కెట్ ని తినేస్తుంది. ఈ వీడియోను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment