తోడబుట్టిన బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే : చిరంజీవి

ఈరోజు అంతర్జాతీయ బ్రదర్స్ డే.. బ్రదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అరుదైన ఫొటోను షేర్ చేసుకున్నారు. తన ఇద్దరు సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో తన చిన్నప్పటి ఫొటోను పంచుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫొటోలో చిన్నవాడైన పవన్ కళ్యాణ్ ను చిరంజీవి ఎత్తుకుని ఉండగా, పక్కన నాగబాబు చిరు నవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఈ ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు చిరంజీవి.. ‘తోడబుట్టిన బ్రదర్స్ కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే’ అంటూ విషెస్ తెలిపారు. 

కాగా, ప్రతి సంవత్సరం మే 24న బ్రదర్స్ డే జరుపుకుంటారు. ఫాదర్స్ డే, మదర్స్ డే, లవర్స్ డే మాదిరి బ్రదర్స్ డేగా ప్రపంచ దేశాలు ప్రతి ఏడాది నిర్వహించుకుంటాయి. మొదటగా బ్రదర్స్ డేను కేవలం అమెరికాలో మాత్రమే నిర్వహించుకునే వారు. తర్వాత అన్ని దేశాల్లో ఇది మొదలైంది. 

 

Leave a Comment