హైవే కిల్లర్ మున్నా కేసు.. 12 మందికి ఉరిశిక్ష వేసిన ఒంగోలు కోర్టు..!

హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంటోలు కోర్టు సంచలన తీర్పు చెప్పింది. మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్ష, మరో ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి జి.మనోహర్ రెడ్డి తీర్చు ఇచ్చారు. 2008లో జాతీయ రహదారిపై వాహనాలు చోరీ, డ్రైవర్ల హత్య వంటి పలు కేసులు ఈ మున్నా గ్యాంగ్ పై ఉన్నాయి. 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో 18 మందిపై నేరం నిర్ధారణ అయింది. ఈ కేసులో ఒంగోలు జిల్లా కోర్టు ఈ గ్యాంగ్ లోని ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి ఉరిశిక్ష విధించింది..

మున్నా గ్యాంగ్ పోలీసుల మాదిరి వేషాలు ధరించి హైవేపై వాహనాలను ఆపేవారు. చెకింగ్ పేరుతో లారీలోకి డ్రైవర్లు, క్లీనర్ల గొంతులకు తాడు పాశవికంగా హతమార్చేవారని పోలీసుల విచారణ తేలింది. ఒంగోలు పరిధిలో మొత్తం 4 కేసుల్లో ఏడుగురిని హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. తమిళనాడు లారీ డ్రైవర్ రామశేఖర్, క్లీనర్ పెరుమాళ్ సుబ్రమణిలను ఉలవపాడు సమీపంలో హత్య చేసి అందులోని 21.7 టన్నుల ఇనుమును గుంటూరులోని ఒక ప్రముఖ వ్యాపారికి విక్రయించారు. డ్రైవర్, క్లీనర్ శవాలను గోతాలలో కుక్కి మద్దిపాడు మండలం ఇనుమనమెళ్లురు గుండ్లకమ్మ వాగు కట్టలో పూడ్చి పెట్టారు. 

పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుంచి ఇనుప రాడ్ల లోడ్ తో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్ అదృశ్యం అయ్యారంటూ 2008 అక్టోబర్ 17న లారీ యజమాని వీరప్పన్ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. విచారణ చేపట్టిన పోలీసులు సయ్యద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 20కి పైగా సిమ్ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నించిన మున్నాను కర్ణాటకలో అరెస్టు చేశారు. 

Leave a Comment