‘జన్మనిచ్చిన అమ్మకి జన్మదిన శుభాకాంక్షలు’.. చిరంజీవి ఎమోషనల్ వీడియో..!

సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. నేడు చిరు తల్లి అంజనా దేవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. ‘జన్మనిచ్చిన అమ్మకు శుభాకాంక్షలు.. హ్యీపీ బర్త్ డే అమ్మ’ అంటూ రాసుకొచ్చారు. 

ఈ వీడియోలో చిరంజీవి తన అమ్మను ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోలు ఉన్నాయి. దీంతో పాటు తల్లిదండ్రులు కొణిదెల వెంకట్ రావు-అంజనా దేవితో కలిసి నాగబాబు, పవన్ కల్యాణ్, ఇతర కుటుంబ సభ్యుల కులుసుకున్న ఫొటోలను జత చేశారు. ఇక ముగ్గురు అన్నదమ్ములు అమ్మతో దిగిన సెల్ఫీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment