బూడిదతో బాపూ బొమ్మ.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కర్నూలు యువకుడు..!

ముంబై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ 2021 జాబితాలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువకుడు చోటు సంపాదించుకున్నాడు. బూడిదతో బాపూ బొమ్మను అత్యంత సహజంగా చిత్రీకరించినందుకు ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. సంస్థ నుంచి గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. 

ఆదోని పట్టణం నారాయణ గుంతకు చెందిన శ్రీవైష్ణవ శ్రీకాంత్ ఎంబీఏ పూర్తి చేసి చెన్నైలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. ఈనెల 4న శ్రీకాంత్ కాగితాన్ని కాల్చగా వచ్చిన బూడిదతో మహాత్మ గాంధీ బొమ్మను చిత్రీకరించాడు. ముని వేళ్లను అద్ది తెల్ల కాగితంపై బొమ్మను అపురూపంగా తీర్చిదిద్దారు. 

ఇలా బొమ్మ పూర్తిగా చిత్రీకరించే వరకు వీడియో రికార్డు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకు పంపారు. ఆ వీడియోను పరిశీలించిన సంస్థ ప్యానల్ కమిటీ 2021-22లో అత్యుత్తమ ఆర్ట్ గా గుర్తించింది. అతన్ని గౌరవిస్తూ కరోనా నిబంధనల దృష్ట్యా గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్ ద్వారా పంపింది. దీంతో ఆ యువకుడు ఆనందం వ్యక్తం చేశాడు. 

Leave a Comment